యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి.
తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.) యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం వల్లే వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి పథకాలు ఒక్కొక్కటి ప్రజల ముందుకు వస్తున్న
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి.


తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.)

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేసీఆర్ పుణ్యమే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం వల్లే వరి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన అభివృద్ధి పథకాలు ఒక్కొక్కటి ప్రజల ముందుకు వస్తున్నాయని జగదీష్ రెడ్డి అన్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ ను అడ్డుకోకుండా, కూల్చకుండా ప్రారంభం చేసినందుకు సీఎంకు, జిల్లా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ హయంలో రైతులకు లాభం జరిగితే... కాంగ్రెస్ పాలనలో రైతులకు తీరని అన్యాయం జరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. SLBC ఆలస్యం కావడానికి కారకులు ఎవరో, TBM టెక్నాలజీ ఎందుకు తెచ్చారో త్వరలో భయటపెడతామని అన్నారు. మూసీ ప్రక్షాళనకు నడుం కట్టిందే బీఆర్ఎస్, మేము మొదలు పెట్టిన పనులు కొనసాగించాలని డిమాండ్ చేశారు. వీలైతే ప్రభుత్వం కొత్త పనులకు శంకుస్థాపనలు చేయాలన్నారు. జిల్లా కాంగ్రెస్ నేతలపై పోరాటం మొదలుపెడతామన్నారు. కీలక నేతల భరతం పడతామని జగదీష్ రెడ్డి అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande