తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.) మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈసందర్భంగా ఆయన ఇందిరమ్మ మోడల్ గృహం నిర్మాణ
పనులను, ఇందిరా మహిళా శక్తి క్యాంటిను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్రు నాయక్తో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి
మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్