సిగ్నల్ వ్యవస్థలో సమస్య.. నిలిచిన రైళ్లు..
హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.) హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి నాగ్పుర్ వెళ్లే వందే భారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నల్స్ సమస్యతో ఈ ఘటన చోటు చేసు
రైళ్ల ఆలస్యం


హైదరాబాద్, 8 డిసెంబర్ (హి.స.)

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్లో హైదరాబాద్ నుంచి నాగ్పుర్ వెళ్లే వందే భారత్, ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు అరగంట పాటు నిలిచిపోయాయి. సిగ్నల్స్ సమస్యతో ఈ ఘటన చోటు చేసుకుంది. అనంతరం వీటిని రైల్వే అధికారులు స్టేషన్ నుంచి పంపించారు. ఉప్పల్ స్టేషన్లో సింగరేణి ప్యాసింజర్ 20 నిమిషాలుగా ఆగిపోయింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande