తెలంగాణ, 8 డిసెంబర్ (హి.స.)
రేపు రాష్ట్ర సచివాలయంలో ఆవిష్కరణ చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహం సహా తెలంగాణ అమరవీరుల జ్యోతి రూప శిల్పి రమణా రెడ్డి ని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సత్కరించారు. మహేష్ కుమార్ గౌడ్
స్వగృహంలో ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రమణారెడ్డి కళాత్మకతని అభినందిస్తూ, శాలువలు, జ్ఞాపికలతో
సన్మానించారు. తెలంగాణ తల్లి విగ్రహంలో అమర వీరుల పిడికిళ్లని జోడించడం ఉద్యమ స్ఫూర్తికి
నిదర్శనంగా, స్పర్తిదాయకంగా ఉందని ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కాగా తెలంగాణ
తల్లి విగ్రహం రూపకర్త ప్రొఫెసర్ తోపారపు గంగాధర్ ను ప్రభుత్వం నిన్ననే జవహర్ లాల్ నెహ్రు ఆర్ట్స్ & జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్గా నియమించడం
ద్వారా గౌరవించుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్