దిల్లీ,, 8 డిసెంబర్ (హి.స.) రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రష్యాలో పర్యటించనున్నారు. సోమవారం ఆయన భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్ తుషీల్ అనే స్టెల్త్ యుద్ధనౌకను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. రష్యాలోని కలినిన్‌గ్రాడ్ నగరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత ఆధునిక ఫ్రిగేట్ తరగతి యుద్ధనౌకల్లో ఇదొకటి నిపుణులు చెబుతున్నారు. హిందు మహాసముద్ర ప్రాంతంలో భారత నౌకాదళ పోరాట సామర్థ్యాన్ని ఇది మరింత మెరుగుపరుస్తుందని చెప్పారు. ఈ పర్యటనలో.. రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలోవ్‌సోవ్‌తో రాజ్‌నాథ్ చర్చలు జరపనున్నారు. సైనిక సాధన సంపత్తిని ఉమ్మడిగా ఉత్పత్తి చేసే అంశంలో సహకారాన్ని విస్తృతం చేసుకునే అంశంపై ఇద్దరు నేతలు దృష్టిసారించనున్నారు. రాజ్‌నాథ్ వెంట భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి కూడా రష్యా వెళతారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు