ముంబయి: 8 డిసెంబర్ (హి.స.)మహారాష్ట్ర లో మహాయుతి ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) సభ్యులు ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో యాంటి-ఈవీఎం కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
‘‘ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈవీఎంలపై ప్రజల్లో విశ్వాసం లేదు. అయినా.. ఓటు వేశారు. అమెరికా, ఇంగ్లాండ్‌తో సహా ప్రపంచమంతా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తోంది. భారత్‌లో మాత్రమే ఈవీఎంలు ఎందుకు? ఇక్కడి ప్రజలు బ్యాలెట్‌లతోనే ఎన్నికలు నిర్వహించాలని కోరుకుంటున్నారు’’ అని పేర్కొనారు. ఎన్నికల ప్రక్రియపై స్థానిక ప్రజల్లో ఎలాంటి ఫిర్యాదులున్నా తనకు అందజేయాలని వాటిని ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపిస్తానని శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు