వరుస సినిమాలతో రామ్ చరణ్ బిజీ
తెలంగాణ :వినోదం :మార్చి 25 (హిం.స)''ఆర్ ఆర్ ఆర్'' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడ
వరుస సినిమాలతో రామ్ చరణ్ బిజీ


తెలంగాణ :వినోదం :మార్చి 25 (హిం.స)''ఆర్ ఆర్ ఆర్'' సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ఇచ్చిన జోష్తో చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్న చరణ్ తాజాగా బుచ్చిబాబు సానా డైరెక్షన్లో ఆర్సీ 16 ఓకే చేశాడు. అయితే రామ్ చరణ్ పుట్టినరోజు దగ్గరపడుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 27న చరణ్ తన పుట్టినరోజు జరుపుకో బోతున్నాడు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఇప్పటికే అప్డేట్లు ప్లాన్ చేసుకుంటున్నారు

దిల్ రాజు ప్రస్తుతం రామ్ చరణ్ ''గేమ్ ఛేంజర్'' సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్ లో ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ లుక్ కు, టైటిల్ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సంపత్ రావు, హిందుస్థాన్ సమాచారం.


 rajesh pande