సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకల నిర్వహణ.. మలేషియాలో.. మంచు విష్ణు
తెలంగాణ వినోదం మార్చి 27 (హిం.స) తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను, అత్యంత వైభవంగా ఘనంగా చేయాలన
సినీ పరిశ్రమ 90 ఏళ్ల వేడుకల నిర్వహణ.. మలేషియాలో.. మంచు విష్ణు


తెలంగాణ వినోదం మార్చి 27 (హిం.స)

తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను, అత్యంత వైభవంగా ఘనంగా చేయాలని నిర్ణయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఈ వేడుకలను జులై నెలలో మలేషియాలో నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఈ విషయంపై సినీ పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామన్నారు. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జులై మాసంలో షూటింగ్లకు 3 రోజుల సెలవు ఇవ్వాలని కోరినట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande