స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ కు భారీ జరిమానా
తెలంగాణ క్రీడలు మార్చి 28 (హిం.స)ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు భారీ షాక్
స్లో ఓవర్ రేటు కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ కు భారీ జరిమానా


తెలంగాణ క్రీడలు మార్చి 28 (హిం.స)ఓటమి బాధలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ నిర్వాహకులు రూ. 12 లక్షల మేర అతడికి భారీ జరిమానా విధించారు. కాగా ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్పై గెలిచి శుభారంభం చేసిన టైటాన్స్.. ఆ తర్వాత జరిగిన మ్యాచ్లో మాత్రం ఓటమిని మూటగట్టుకుంది. చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో ఏకంగా 63 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయని కారణంగా కెప్టెన్ శుబ్మాన్కు ఫైన్ పడింది.

ఈ మేరకు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో.. మార్చి 26న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో స్లో ఓవర్ రేటు మెయింటెన్ చేసిన కారణంగా.. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుబ్మన్ గిల్కు జరిమానా విధిస్తున్నాం.ఈ సీజన్లో ఇది గుజరాత్ టైటాన్స్ తొలి తప్పిదం కాబట్టి.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని నిబంధనల ప్రకారం గిల్కు రూ. 12 లక్షల ఫైన్ వేస్తున్నాం” అని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande