పోలింగ్ కేంద్రాల్లో వందశాతం సౌకర్యాలు కల్పించాలి
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 28(హిం.స): ప్రతి సెక్టార్ అధికారి తమ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేం
పోలింగ్ కేంద్రాల్లో వందశాతం సౌకర్యాలు కల్పించాలి


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), మార్చి 28(హిం.స): ప్రతి సెక్టార్ అధికారి తమ పరిధిలో ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో వందశాతం కనీస సౌకర్యాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తూర్పు నియోజకవర్గం సంబంధించి ఈఆర్వో, సెక్టోరియల్ , రూటు అధికారులు, సూపర్వైసర్లతో పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాల ఏర్పాటు, ఎన్నికల నిర్వహణపై నియోజకవర్గ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

. బస్సులు వెళ్ళేందుకు అనుకూలంగా లేని చోట చిన్న వాహనాలు కు ప్రతిపాదన చేయాలని అన్నారు. ఈవీఎం వినియోగంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి పోలింగ్ కేంద్రం లే అవుట్ సర్వే చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రం పేరు అందరికీ కనిపించేలా ఉండాలని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువ ఉన్నచోట ప్రజలకు ఓటు పట్ల చైతన్యం కలిగించేలా స్వీప్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande