మార్చి 30 31 వ తేదీ శని,ఆదివారం సెలవు తేదీలలో కూడా పనిచేయనున్న ఎల్ఐసి
తెలంగాణ బిజినెస్ మార్చ్ 29 (హిం.స) ఈ వారంతంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల
మార్చి 30 31 వ తేదీ శని,ఆదివారం సెలవు తేదీలలో కూడా పనిచేయనున్న ఎల్ఐసి


తెలంగాణ బిజినెస్ మార్చ్ 29 (హిం.స) ఈ వారంతంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తన అన్ని కార్యాలయాలు మార్చి 30, మార్చి 31 తేదీల్లో తెరిచి ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొంది. సాధారణంగా మార్చి 31లోపు పన్ను చెల్లింపుదారులు, ఇతర లావాదేవీల గురించిన సమగ్ర వివరాలను అందించాల్సి ఉంటుంది. అయితే శని, ఆదివారాలు సెలవు ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఆ రెండు రోజుల్లో ప్రత్యేకంగా ఎల్ ఐసీ కార్యాలయాలు పనిచేస్తాయని అధికారులు తెలిపారు.

ఇప్పటికే దేశంలోని అన్ని బ్యాంకులు కూడా సంబంధిత రోజుల్లో అనగా మార్చి 30, 31 శని ఆదివారం పని చేయనున్నాయి. దీనికి సంబంధించి ఆర్బీఐ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా సలహా మేరకు, ఎస్ఐసీ కూడా పాలసీదారుల కోసం శని, ఆదివారాల్లో పనిచేయాలని నిర్ణయించినట్లు ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. పాలసీదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande