బీజేపీలో చేరనున్న అర్చనా పాటిల్
ఢిల్లీ : 29మార్చ్ ( హింస) సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చ
.....


ఢిల్లీ : 29మార్చ్ ( హింస) సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ హోంశాఖ మంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ చకుర్కర్ కాంగ్రెస్ పార్టీని వీడనున్నారు. అర్చన శుక్రవారం బీజేపీ నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను కలిశారు. ఆమె ముంబైలో రేపు బీజేపీలో చేరనున్నారు. అర్చన కాషాయ పార్టీలో చేరిక మహారాష్ట్రలో కాంగ్రెస్కు నష్టం కలిగిస్తుందని రాజకీయ పరిశీకలకులు అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందు పార్టీ నేతలు వరసగా ఇతర పార్టీల్లో చేరుతుండటంతో కాంగ్రెస్ విజయావకాశాలపై పెను ప్రభావం చూపుతుందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

పుట్ట సుమన్, హిందూస్తాన్ సమాచార


 rajesh pande