, బీహార్లో మహా కూటమి మధ్య సీట్ల విభజన
దిల్లీ, 29 ,మార్చి(హిం.స) బీహార్లో మహా కూటమి మధ్య సీట్ల విభజన జరిగింది. ఇందులో ఆర్జేడీ 26, కాంగ్రెస
, బీహార్లో మహా కూటమి మధ్య సీట్ల విభజన


దిల్లీ, 29 ,మార్చి(హిం.స) బీహార్లో మహా కూటమి మధ్య సీట్ల విభజన జరిగింది. ఇందులో ఆర్జేడీ 26, కాంగ్రెస్ 9, వామపక్ష పార్టీలు 5 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీట్లపై ఒప్పందం కుదిరిందని ఆర్జేడీ నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ సహా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నేతలు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వామపక్ష పార్టీలలో సీపీఐకి బెగుసరాయ్లో ఒక సీటు, సీపీఐ(ఎం)కి ఖగారియాలో ఒక సీటు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. కాగా, సీపీఐ(ఎంఎల్)కు నలంద, అర్రా, కరకత్ మూడు స్థానాలు కేటాయించారు.

కాగా, మహాకూటమిలో సీట్ల పంపకంపై గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉత్కంఠ నెలకొంది. ఇది చివరకు సీట్ల పంపకంపై ఒప్పందంతో ముగిసింది. గోపాల్గంజ్, వాల్మీకినగర్, శివహర్ స్థానాలపై పెద్దఎత్తున ఉత్కంఠ నెలకొంది. రెండు రౌండ్ల సమావేశాల్లో కాంగ్రెస్, ఆర్జేడీ నేతల మధ్య ఢిల్లీలోని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande