ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాల- మోదీ
దిల్లీ, 29 ,మార్చి(హిం.స)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్ల
ప్రపంచంలో అందరికీ టెక్నాలజీ అందుబాటులో ఉండాల- మోదీ


దిల్లీ, 29 ,మార్చి(హిం.స)ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), వాతావరణ మార్పులు, మహిళా సాధికారత..వంటి క్లిష్టమైన అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చర్చించారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న సాంకేతికతలో మార్పులు, సుస్థిరత, సామాజిక సాధికారత వంటి అంశాలపై ఇరువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా ఏఐ ఆవిష్కరణలో దేశం అందిస్తున్న సేవలను బిల్ గేట్స్ ప్రశంసించారు.

కృత్రిమమేధ వాడకం పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు ప్రపంచంలో ఘణనీయమైన మార్పులు చోటుచేసుకోబోతున్నట్లు ఇరువురు మాట్లాడుకున్నారు. ఇండియాఏఐ మిషన్ను ప్రోత్సహించేందుకు బడ్జెట్ను కేటాయించడంపట్ల మోదీ దూరదృష్టిని గేట్స్ ప్రశంసించారు. ఈ మిషన్లో భాగంగా కొత్త ఆవిష్కరణలతోపాటు, సమగ్ర అభివృద్ధి సాధ్యపడుతుందని పీఎం మోదీ చెప్పారు.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande