బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు భద్రత రెట్టింపు.
ముంబై ఏప్రిల్ 15 (హిం.స)బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల కలకలంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిప
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు భద్రత రెట్టింపు.


ముంబై ఏప్రిల్ 15 (హిం.స)బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటివద్ద కాల్పుల కలకలంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాల్పులు జరిపింది మేమే అంటూ గ్యాంగ్ స్టర్ ఆన్మోల్ బిష్ణోయ్ ప్రకటించాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. సల్మాన్ ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మా బలమేంటో నీకు అర్దమై ఉంటుంది. మా సహనాన్ని పరీక్షించొద్దు. ఈసారి తుపాకీ పేలుడు ఇంటిబయట ఆగదు అంటూ హెచ్చరిక జారీ చేసాడు.

అన్మోల్ భారత్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. ప్రస్తుతం అతడు యుఎస్లో దాక్కున్నాడు. సల్మాన్ కి గత కొంతకాలంగా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు ఎదుర్కుంటోన్నాడు. లేఖల రూపంలో.. ఈమెయిల్స్ రూపంలో చంపేస్తామంటూ చాలాసార్లు బెదిరించారు.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande