నేడు కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పెషల్ కోర్టులో విచారణ
ఢిల్లీ: 16 ఏప్రిల్ (హిం.స)నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పె
నేడు కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పెషల్ కోర్టులో విచారణ


ఢిల్లీ: 16 ఏప్రిల్ (హిం.స)నేడు ఈడీ లిక్కర్ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత రెగ్యులర్ బెయిల్‌పై స్పెషల్ కోర్టులో విచారణ జరుగనుంది. పిటిషన్‌లో భాగంగా కవిత.. ఈ కేసులో తన పాత్రకు సంబంధించి ఎలాంటి ఆధారాలులేవని పేర్కొన్నారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని చెప్పుకొచ్చారు.

కాగా, లిక్కర్‌ కేసుకు సంబంధించి నేడు కవిత రెగ్యులర్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. ఇక, పిటిషన్‌లో కవిత పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తనపై అక్రమంగా కేసు పెట్టారని తెలిపారు. అలాగే, నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా చేసుకుని తనను లిక్కర్‌ కేసులో ఇరికించారని కవిత చెప్పుకొచ్చారు. తన పాత్రకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాలు లేవని పేర్కొన్నారు.

మరోవైపు.. కవిత వాదనలను ఈడీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ వాదనలు ఇలా ఉన్నాయి..‘కవిత లిక్కర్‌ కేసులో కింగ్‌ పిన్‌ అని, ఆప్‌-సౌత్‌ గ్రూపునకు మధ్య కవిత దళారీగా వ్యవహరించారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande