పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్రనీదే
దిల్లీ: 16, ఏప్రిల్ ( హిం.స)ప్పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్‌
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్రనీదే


దిల్లీ: 16, ఏప్రిల్ ( హిం.స)ప్పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తరఫున మెహతా వాదనలు వినిపించారు. దేశం మొత్తంపై ప్రభావం చూపే ముఖ్యమైన పరిశ్రమలను కేంద్రం నియంత్రణలోనే ఉంచాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. కరోనా సమయంలో శానిటైజర్ల ఉత్పత్తికి అవసరమైన ఇథనాల్‌ను నిర్ణీత ధరకే అందుబాటులో ఉంచేలా కేంద్రం తనకున్న నియంత్రణ అధికారాన్ని వినియోగించుకునే పరిశ్రమలను ఆదేశించిందని గుర్తు చేశారు. అవసరమైతే పరిశ్రమల్లో తయారయ్యే ఇథనాల్‌ అంతటినీ ఇందుకు కేటాయించేలా కేంద్రం చేయగలదన్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ముఖ్యమైన పరిశ్రమలు ఎల్లప్పుడూ కేంద్రం నియంత్రణలోనే ఉండాలన్నారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande