గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితి
హైదరాబాద్18,,ఏప్రిల్ (హిం.స) వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియో
గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితి


హైదరాబాద్18,,ఏప్రిల్ (హిం.స) వ్యవసాయశాఖ, మార్కెటింగ్ శాఖల ఆధ్వర్యంలో 2020- 21 సంవత్సరము వరకు వినియోగంలో ఉన్న 25 భూసార పరీక్ష కేంద్రాలను తిరిగి రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మనిషి ఆరోగ్యాన్ని తెలుసుకోవడంలో రక్త పరీక్ష ఎలా ఉపయోగపడుతుందో.. నేల పోషక విలువలు గురించి తెలుసుకోవడానికి ‘మట్టి నమూనా పరీక్ష ’ అలా ఉపయోగపడ్తుందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఈ భూసార పరీక్ష కేంద్రాలన్నీ మూత పడే స్థితికి వచ్చాయి.. వాటిని వెంటనే పునరుద్దరింప చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాల్సివుందని ఆయన సూచించారు

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande