నిలకడగా వెండి బంగారం ధరలు..
హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స) రాష్ట్రంలో వెండి బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. పసిడి ధరలు స్వల్ప
నిలకడగా వెండి బంగారం ధరలు..


హైదరాబాద్ ఏప్రిల్ 19 (హిం.స) రాష్ట్రంలో వెండి బంగారం ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి.

పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం ఉదయం 6 గంటల వరకు నమోదైన వివరాల ప్రకారం.. 10 గ్రాముల రేటు నిన్నటి కంటే రూ.10 తగ్గింది. ఇక వెండి ధర కిలోకి రూ.100 చొప్పున తగ్గింది.

తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలు..హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఇవాళ ఉదయం 6 గంటల సమయానికి 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.67,640గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,790గా ఉంది. ఢిల్లీ, ముంబైలో.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.67,790గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.73,940గా ఉంది.ముంబైలో కూడా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,640గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.73,790గా ఉంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.100 తగ్గి, రూ.89,900గా ఉంది.విజయవాడలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది.విశాఖలో కూడా కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.89,900గా ఉంది.ఢిల్లీలో కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.86,400గా ఉంది.ముంబైలో కిలో వెండి ధర రూ.100 తగ్గి .86,400 గా ఉంది.

సంపత్ రావు హిందుస్థాన్ సమాచారం


 rajesh pande