కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో మారు పరాభవం..
న్యూఢిల్లీ ఏప్రిల్ 24 (హిం.స)కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మరో మారు పరాభవం ఎదురైంది. కాశ్మీర్ అంశాన్
కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు మరో మారు పరాభవం..


న్యూఢిల్లీ ఏప్రిల్ 24 (హిం.స)కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మరో మారు పరాభవం ఎదురైంది. కాశ్మీర్ అంశాన్ని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తమ దేశంలో పర్యటిస్తున్న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీతో ప్రస్తావించినప్పటికీ, ఆయన నుంచి సరైన స్పందన రాలేదు. షెహబాజ్ రెండు, మూడు సార్లు కాశ్మీర్ ప్రస్తావన చేసినప్పటికీ, ఇబ్రహీమ్ రైసీ పట్టించుకోలేదు. షరీఫ్ కాశ్మీర్ అంశం గురించి ప్రస్తావిస్తూ ఉంటే, రైసీ మరో అంశం ప్రస్తావించడాన్ని బట్టి కాశ్మీర్పై మాట్లాడేందుకు తనకు ఇష్టం లేదనే విషయం చెప్పకనే చెప్పారు.

భారత్తో ఇరాన్కి ఎంతో కాలంగా సత్సంబంధాలున్నాయి.పాకిస్తాన్తో పోలిస్తే భారత్తో ద్వైపాక్షిక సంబంధాల ను అత్యంత విలువైనవిగా ఇరాన్ భావిస్తోంది.భారత్ని నమ్మ దగినమిత్ర దేశంగా పరిగణిస్తోంది. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడుల విషయంలో మొదట ఇజ్రాయెల్ని భారత్ సమర్ధించినా, అక్కడి పరిస్థితులను అంచనా వేసిన తర్వాత ఇజ్రాయెల్ దాడులను ఖండించింది భారత్ మాత్రమేనన్న సంగతి ఇరాన్కి తెలుసు. అమెరికాతో భారత్ సంబంధాలు వ్యూహాత్మకమైనవని ఇరాన్ పరిగణిస్తోంది. పాకిస్తాన్ నిధుల కోసం అమెరికాతో,చైనాతో సన్నిహితం గా మెలుగుతోందన్న విషయం కూడా ఇరాన్కి తెలుసు. అందువల్లనే పాక్తో మైత్రి కొనసాగించినా సమాన దూరాన్ని పాటిస్తోంది.

రంజిత్ కుమార్ హిందుస్థాన్ సమాచారం


 rajesh pande