సర్కులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలి
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 25(హిం.స): ఉక్కునగరంలో నివసిస్తున్న ఉక్కునగర వాసులపై విద్యుత్ భారా
సర్కులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలి


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 25(హిం.స): ఉక్కునగరంలో నివసిస్తున్న ఉక్కునగర వాసులపై విద్యుత్ భారాన్ని వేసే సర్కులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలన భవనం ఎదుట పెంచిన విద్యుత్ చార్జీల సర్కులర్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన 78 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు మాట్లాడుతూ యాజమాన్యం ఏకపక్షంగా ఉక్కునగర వాసులపై అనేక భారాలను మోపుతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. అలాగే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన వివరించారు. నేడు ఉక్కు పరిశ్రమను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేయకుండా నాసిరకమైన బొగ్గును కొనుగోలు చేసి పరిశ్రమను అదానీ,అంబానీలకు కట్టబట్టే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను సమర్థిస్తున్న ఉక్కు యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్, స్టీల్ సిఐటియు నాయకులు పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, కృష్ణమూర్తి, కిమోతి బాబు, రాజు, మహేష్, మిత్రపక్షాల నాయకులు శ్రీనివాస్ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande