ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
న్యూ డిల్లీ ,25ఏప్రిల్ (హిం.స) ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య


న్యూ డిల్లీ ,25ఏప్రిల్ (హిం.స) ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. సమాజ సంక్షేమం కోసం సంపద పునఃపంపిణీ జరగాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై జరిగిన విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది.

. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రస్తావించిన (39 (బి), 31 (సి) అధికరణాలను సాకుగా చూపుతూ ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోజాలరని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘‘ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులుగా పరిగణించాలనడం సరికాదు. ఇలాంటి అభిప్రాయం ప్రమాదకరం. ఉదాహరణకు.. 39 (బి) అధికరణం కింద ప్రైవేటు అడవులకు ప్రభుత్వ విధానాలు వర్తించవు, అందువల్ల సర్కారు దాని విషయంలో జోక్యంచేసుకోజాలదు అనడం తగదు’’ అని పేర్కొంది.

హిందుస్థాన్ సమాచార నాగరాజ్


 rajesh pande