శ్రీ ఎరుకుమాంబ ఆశీస్సులతో విజయం వైసీపీ దే...: ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్
విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి
శ్రీ ఎరుకుమాంబ ఆశీస్సులతో విజయం వైసీపీ దే...: ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్


విశాఖపట్నం(ఆంధ్రప్రదేశ్), ఏప్రిల్ 26(హిం.స): దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 27వ వార్డు వైసిపి నాయకులు సర్వేశ్వర్ రెడ్డి, ఆధ్వర్యంలో దొండపర్తి జంక్షన్ లో కొలువుదీరిన శ్రీ ఎరుకుమాంబ ఆలయంలో పూజలు చేసి ప్రచార ర్యాలీ ప్రారంభించారు. ఆయనతో పాటు జిల్లా అధ్యక్షులు కోలా గురువులు, మాజీ కార్పొరేటర్ రవిరాజు, పద్మనాభం అమ్మాజి తదితర ముఖ్య నాయకులు పాల్గొని వాసుపల్లి తో పాటు ఓటర్లను అభ్యర్థించారు. కూటమి కుండ బద్దలు కొడతామని, దక్షిణంలో అత్యధికంగా ఉండే మైనారిటీ ముస్లింలు క్రిస్టియన్ లు వైసీపీకి మాత్రమే ఓటు వేస్తున్నారన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే బిజెపితో జతకట్టిన టిడిపి జనసేన అసలు గుట్టు బట్టబయలు అయిందన్నారు. ప్రజల్ని ఇక మభ్య పెట్టలేరని జగనన్న అందించిన సంక్షేమ పథకాలే తమకు వెపన్ లా పనిచేస్తున్నాయాన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూర్చిన వైసీపీ ప్రభుత్వానికి మళ్లీ గెలిపించుకోవడానికి ప్రజల సంతోషంగా మద్దతు తెలుపుతున్నారని వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. 48 46 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయనీ జన వాహిని బలం మాదని అన్నారు. అన్ని వార్డులో విస్తృతంగా వైసిపి ప్రచారాలు కొనసాగుతున్నాయన్నారు. కుమారుడు వాసుపల్లి సూర్య, కోడలు రాశి, మరోపక్క మా నాయకులు ద్రోణం శ్రీవాత్సవ్, మూగి శ్రీనివాస్ ఆయా వార్డుల్లో గడప గడపకు వెళ్లి ప్రజల్ని అభ్యర్థిస్తున్నారన్నారు. 27 వార్డు ప్రచారంలో గొల్లపు రఘు రాం, చిట్టిబోయిన శివ, అజయ, అశోక్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

- కృష్ణమూర్తి, హిందూస్తాన్ సమాచార్.


 rajesh pande