హైదరాబాద్ జిల్లా నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభ
హైదరాబాద్, 10 జూలై (హి.స.)టీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు శ్రీ.మారం జగదీశ్వర్ గారికి మరియు నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) గారికి హైదరాబాద్ జిల్లా నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభ పొట్టి శ్రీరాములు తెలుగు లలిత కళా
హైదరాబాద్ జిల్లా నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభ


హైదరాబాద్, 10 జూలై (హి.స.)టీఎన్జీస్ యూనియన్, కేంద్ర సంఘ నూతన అధ్యక్షులు శ్రీ.మారం జగదీశ్వర్ గారికి మరియు నూతన ప్రధాన కార్యదర్శి డాక్టర్.ఎస్.ఎం.హుస్సేని (ముజీబ్) గారికి హైదరాబాద్ జిల్లా నిర్వహిస్తున్న ఆత్మీయ సన్మాన సభ పొట్టి శ్రీరాములు తెలుగు లలిత కళా ప్రాంగణంలో యావత్ జిల్లా ఉద్యోగుల సమక్షంలో ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దలు గౌరవనీయులు ప్రొఫెసర్ కోదండరాం గారు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడు ఏల్లూరి శ్రీనివాసరావు గారు, హైదరాబాద్ సిటీ, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా,వరంగల్ జిల్లా, నిజామాబాద్ జిల్లా, హనుమకొండ జిల్లా, కామారెడ్డి జిల్లా, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి, కేంద్ర సంఘ సభ్యులు, వివిధ యూనిట్, అధ్యక్షులు, కార్యదర్శిలు, ప్రాధమిక సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యల పట్ల క్రుప్తంగా మాట్లాడడం జరిగింది. ముగింపు కార్యక్రమంలో విచ్చేసిన అతిథులకు జ్ఞాపకతో సత్కరించి వచ్చిన ఉద్యోగులందరికీ మరియు ప్రింట్ మరియు ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులకు జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande