తెలంగాణ ప్రభుత్వ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన సి ఎస్ శాంతి కుమారి
Telangana, హైదరాబాద్. 10 జూలై (హి.స.) తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా బదిలీ చేసి
తెలంగాణ నూతన డి జె పి జితేందర్


Telangana, హైదరాబాద్. 10 జూలై (హి.స.)

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక

నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర నూతన డీజీపీగా 1992 బ్యాచ్కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమించింది. ప్రస్తుత డీజీపీ రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శిగా బదిలీ చేసింది. ఈ మేరకు బుధవారం సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఈ విషయాన్ని హిందుస్థాన్ సమాచార్ ముందే చెప్పడం జరిగింది. డీజీపీగా నియామకమైన జితేందర్ ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

కాగా, ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో శాంతి భద్రతలు క్షీణించాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. నగరంలో రోజుకో మర్డర్.. వారానికో అత్యాచారం జరుగుతోందని.. రాజధానిలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిందని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వంపైన ప్రతిపక్షాలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం డీజీపీని బదిలీ చేసినట్లు తెలుస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / Bachu Ranjith Kumar / నాగరాజ్ రావు


 rajesh pande