
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
తెలంగాణలో డిసెంబర్ 31న అర్ధరాత్రిఒంటి గంట వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు డ్రగ్స్, గంజాయి కేసులు నమోదు అవ్వకుండా చర్యలు తీసుకుంటామని కమిషనర్ సజ్జనార్ స్టేట్మెంట్ ఇస్తూనే మరోవైపు ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సమయం పెంచడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణలో 29 లక్షల మంది డ్రగ్స్ సేవించేవాళ్లు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని వాళ్లంతా ఎక్కడ నుండి తెప్పించుకుంటున్నారు అనే విషయం తెలంగాణ సీఎం, డీజీపీ చెప్పాలన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు యువత అంతా డ్రగ్స్ కు బానిసనలు అవుతున్నారని చివరికి పోలీసుల పిల్లలు కూడా డ్రగ్స్ కు అలవాటు పడుతున్నారని చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..