వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. డా.జయ సింహులు.మృతి
Telangana, 10 జూలై (హి.స.) అమరావతి: సీనియర్ విద్యావేత్త, వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వి. జయసింహులు నాయుడు మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. చదువుకు
వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్. డా.జయ సింహులు.మృతి


Telangana, 10 జూలై (హి.స.)

అమరావతి: సీనియర్ విద్యావేత్త, వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రొఫెసర్ డాక్టర్ వి. జయసింహులు నాయుడు మృతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. చదువుకునే రోజుల్లో ప్రొఫెసర్ జయసింహులు తన సహచర విద్యార్థి, స్నేహితుడని తెలిపారు. వేలాదిమంది విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడంతో పాటు తన రచనల ద్వారా ఎంతోమందికి మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. జయసింహులు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ముగింపు

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande