విజయవాడ, 4 ఫిబ్రవరి (హి.స.):నందిగామలోమూడు రోజుల ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. నందిగామ మున్సిపల్ చైర్మన్‌గా మండవ కృష్ణకుమారి ఎన్నికయ్యారు. టీడీపీకి 15, వైసీపీకి అనుకూలంగా మూడు ఓట్లు పడటంతో కృష్ణకుమారి విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. టీడీపీ అధిష్టానం ఆదేశాలతో కృష్ణకుమారికి మద్దతుగా ఎమ్మెల్యే, ఇతర సభ్యులు ఓటేశారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన కృష్ణకుమారికి ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య , ఇతర సభ్యులు అభినందనలు తెలిపారు. గత మూడు రోజులుగా నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మొదటి నుంచి టీడీపీ ప్రతినిధిగా, ఎమ్మెల్యేగా తంగిరా సౌమ్య కొనసాగుతున్న విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల