హైదరాబాద్, 4 ఫిబ్రవరి (హి.స.)కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న )పై రెడ్డి సంఘాల నేతలు మండిపడుతున్నారు. తమ కులాన్ని దూషించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28న వరంగల్ వేదికగా బీసీ సభను తీన్మార్ మల్లన్న నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రెడ్డి కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, కుక్కలతో పోలుస్తూ దూషించారని ఆరోపణలు వస్తున్నాయి. మల్లన్న వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రెడ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెడ్డి కులాన్ని కించపరిచేలా దూషించారని, అతనిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు