అమెరికా అధ్యక్ష ఎన్నికల నుండి జో బైడెన్ తప్పుకోవడం పై స్పందించిన డోనాల్డ్ ట్రంప్
అమెరికా జూలై 22 హిం.స: అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు. జో బైడెన్
డోనాల్డ్ ట్రంప్ స్పందన


అమెరికా జూలై 22 హిం.స:

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ తప్పుకోవడంతో పాటు కమలా హారిస్ పోటీ చేయడంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. బైడెన్ కంటే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ను ఓడించడం సులభమని తాను భావిస్తున్నానని అన్నారు. జో బైడెన్ అధ్యక్షుడిగా పోటీ చేసే అర్హత లేదన్నారు.. యూఎస్ ప్రజలకు సేవ చేయడానికి అతడు అర్హత కాదని పేర్కొన్నారు.

ఇక, 'దేశ చరిత్రలో చెత్త అధ్యక్షుడిగా జో బైడెన్ నిలిచిపోతాడని డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అతడికి అధ్యక్షుడిగా ఉండటానికి హక్కు లేదు.. ప్రెసిడెంట్ పదవికి అర్హుడు కాదని వైద్యులు, మీడియాతో సహా ఆయన చుట్టూ ఉన్న వారందరికీ తెలుసు అని ఎద్దేవా చేశారు. అబద్ధాలు చెప్పి ఫేక్ న్యూస్ సృష్టించి అధ్యక్ష పదవిని సాధించుకున్నారు.. ఇక, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగితే ఎన్నికల్లో ఆమెను ఓడించడం మాకు మరింత ఈజీ అని ట్రంప్ చెప్పుకొచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande