ఢిల్లీ, 12 జనవరి (హి.స.)హమాస్ మానవ కవచాలను వాడుతోందని పాలస్తీనా అథారిటీ (పీఏ) సంస్థ తీవ్ర ఆరోపణలు చేసింది. వెస్ట్‌బ్యాంక్‌లో ఆ సంస్థ కార్యకలాపాలను ఏమాత్రం అంగీకరించబోమని హెచ్చరించింది. ఈ ఆరోపణలను హమాస్ నాయకుడు అబ్దుల్ రహ్మాన్ షడిడ్ ఖండించారు. పాలస్తీనా అథారిటీనే తమ సభ్యులను హత్యచేసేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తూ టెలిగ్రామ్ ఛానెల్‌ల్లో ఓ ప్రకటన విడుదల చేశారు.
తుల్కార్మ్ గవర్నరేట్ వద్ద ఏం జరిగిందో చూశారుగా. భద్రతా దళాలు హమాస్ వాహనంపై కాల్పులు జరిపాయి. అందులోని వారిని హత్యచేసేందుకు చూశాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే జరిగిన రెండో దాడి ఇది. వెస్ట్‌బ్యాంక్‌లో హమాస్ సభ్యులను చంపాలని పాలస్తీనా అథారిటీ సూచనలు జారీ చేసినట్లు ఇది ధ్రువీకరిస్తోంది’’ అని పేర్కొన్నారు.
గత 38 రోజుల్లో జెనిన్ శరణార్థి శిబిరంలో జరిగిన ఘటనలను చూస్తే.. పాలస్తీనీయుల రక్తం చిందించడానికి పీఏ కుట్రపన్నుతున్నట్టు అర్థమవుతోందని ఆరోపించారు. అక్కడ 19 మంది మరణానికి ఆ సంస్థే కారణమని ఆరోపించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు