స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
ముంబయి, 25 జూలై (హి.స.)| : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన లాభాలపై బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదించడం వంటి కారణాలతో గురువారం ఉదయం భారీ నష్టాలతో సూచీలు ట్రేడింగ్‌
స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు


ముంబయి, 25 జూలై (హి.స.)| : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు (Stock market) స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, మూలధన లాభాలపై బడ్జెట్‌లో పన్ను ప్రతిపాదించడం వంటి కారణాలతో గురువారం ఉదయం భారీ నష్టాలతో సూచీలు ట్రేడింగ్‌ను ఆరంభించాయి. యాక్సిస్‌ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లో అమ్మకాలు సూచీలను పడేయగా.. టాటా మోటార్స్‌, ఎల్‌అండ్‌టీ స్టాక్స్‌ దన్నుగా నిలిచాయి. దీంతో భారీ నష్టాల నుంచి సూచీలు గట్టెక్కాయి. నిఫ్టీ 24,400 స్థాయిని నిలుపుకొంది.

సెన్సెక్స్‌ ఈ ఉదయం 79,542.11 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 80,148.88) నష్టాల్లో ప్రారంభమైంది. ఆద్యంతం నష్టాల్లో కొనసాగినప్పటికీ.. నష్టాలు క్రమంగా తగ్గుముఖం పడుతూ వచ్చాయి.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande