పార్లమెంట్ వద్ద ఆసక్తికర దృశ్యం.. కేంద్ర మంత్రుల చేయి పట్టుకున్న రాహుల్ గాంధీ..
న్యూఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.) రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఒక అరుదైన సన్ని వేశం చోటుచేసుకుంది. లోక్సభలో బడ్జెట్పై విరుచుకుపడిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్ గాంధీ, నేరుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి
రాహుల్ గాంధీ


న్యూఢిల్లీ, 11 ఫిబ్రవరి (హి.స.)

రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, పార్లమెంట్ ఆవరణలో బుధవారం ఒక అరుదైన సన్ని వేశం చోటుచేసుకుంది. లోక్సభలో బడ్జెట్పై విరుచుకుపడిన అనంతరం బయటకు వచ్చిన రాహుల్ గాంధీ, నేరుగా కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతున్న చోటుకు వెళ్లారు. వివరాల్లోకి వెళితే.. కేంద్ర మంత్రులు రాహుల్ గాంధీ ప్రసంగాన్ని తప్పుబడుతూ మీడియాకు 'బైట్స్' ఇస్తుండగా, రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి అక్కడికి చేరుకున్నారు. మంత్రులను చూసి నవ్వుతూ.. 'విడివిడిగా ఎందుకు, కలిసి ఇంటర్వ్యూ ఇద్దాం రండి' అంటూ సరదాగా ప్రతిపాదించారు. అంతేకాకుండా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి చేయి పట్టుకుని తన వైపునకు ఆహ్వానించారు. అయితే, రాహుల్ గాంధీ చర్యతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయిన మంత్రులు ఇద్దరూ ఆయన ప్రతిపాదనను తిరస్కరించి, అక్కడి నుంచి త్వరత్వరగా వెనుదిరిగారు. ఈ క్రమంలో ప్రియాంక గాంధీ నవ్వుతూ కనిపించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande