
న్యూఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)
భారత దేశంలో నక్సల్ ప్రభావిత
జిల్లా లేదని కేంద్ర ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటించింది. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లా ఒక్కటి కూడా లేదని రాష్ట్రాలకు ఇచ్చిన సమాచారంలో కేంద్రం వెల్లడించింది. నేషనల్ పాలసీ, యాక్షన్ ప్లాన్ కింద ఉన్నతస్థాయి సెక్యూరిటీ సమీక్ష జరిగింది. ఆ తర్వాత తొమ్మిది రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, బిహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లకు ఒక అధికారిక సందేశాన్ని పంపింది. మార్చి 27వ తేదీన నక్సల్ ప్రభావిత జిల్లాలుగా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్, జార్ఖండ్లోని పశ్చిమ సింగ్బమ్ జిల్లాలున్నట్టు కేంద్రం నోటిఫై చేసింది. తాజాగా, ఏప్రిల్ 8న రాష్ట్రాలకు పంపిన సందేశంలో ఒక్క జిల్లా కూడా నక్సల్ ప్రభావితంగా లేదని స్పష్టం చేసింది. అయితే, ఈ తొమ్మిది రాష్ట్రాల్లో 37 జిల్లాలను లెగసీ, థ్రస్ట్ జిల్లాలుగా, ఒక కన్సర్న్ జిల్లాగా సూచించింది. ఈ జిల్లాల్లో నక్సల్స్ ప్రభావం లేదని, వారి కదలికలే లేవని, కానీ, మళ్లీ ఆ కొనసాగుతుందని సవాల్ పునరుద్ధరణ చెందకుండా సెక్యూరిటీ మోహరింపు కొంతకాలం వివరించింది. మన దేశం నుంచి నక్సలిజాన్ని అంతం చేస్తామని, అందుకు మార్చి 31వ తేదీని కేంద్రం డెడ్లైన్గా విధించింది. మార్చి 31వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. దేశంలో దాదాపుగా నక్సలిజం అంతమైందని స్పష్టం చేశారు. ఈ డెడ్లైన్ ముగిసిన తర్వాత హైలెవెల్ సెక్యూరిటీ సమీక్ష చేపట్టారు. ఆ తర్వాతే దేశంలో నక్సల్ ప్రభావిత జిల్లా లేదని రాష్ట్రాలకు సమాచారమిచ్చినట్టు అధికారులు పీటీఐ ఏజెన్సీకి వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు