కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ
కీలక వాణిజ్య చర్చలకు ముందు, అమెరికా ప్రతినిధితో భారత రాయబారి భేటీ
ప్రతినిథి


న్యూఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)

అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా వాషింగ్టన్లో అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమీసన్ గ్రీర్, జాతీయ భద్రతా మాజీ సలహాదారు రాబర్ట్ ఓ'బ్రియన్లతో భేటీ అయ్యారు. భారత్, అమెరికా మధ్య మరోసారి వాణిజ్య చర్చలు జరగనున్న తరుణంలో, ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు భారత అధికారుల బృందం అమెరికాను సందర్శించనుంది.

ఈ క్రమంలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అంశంపై జెమీసన్ గ్రీర్, వినయ్ మోహన్ క్వాత్రా చర్చించారు. ఈరోజు ఇండియా హౌస్లో అంబాసిడర్ జేమీసన్ గ్రీర్, అంబాసిడర్ రాబర్ట్ ఓ'బ్రియన్లకు ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నాం అని వినయ్ మోహన్ క్వాత్రా 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. ద్వైపాక్షిక సహకారంపై ఇరుదేశాలకు ఉన్న అవకాశాలపై చర్చించినట్లు తెలిపారు. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న కీలక పరిణామాలపై చర్చించామని వెల్లడించారు.

వాణిజ్య చర్చల కోసం భారత బృందం వచ్చేవారం వాషింగ్టన్ వెళ్లనుంది. భారత్, అమెరికా ప్రతినిధులు ఈ నెల 20 నుంచి మూడు రోజుల పాటు వాషింగ్టన్లో చర్చలు జరపనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande