అమిత్ షా వర్సెస్ అఖిలేశ్.. లోక్సభలో వాడీవేడి చర్చ
మహిళా రిజర్వేషన్ అమలు, డీలిమిటేషన్ బిల్లులకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా, ఎస్పీ నేత అఖిలేశ్ యాదవ్ మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. డీలిమిటేషన్ ద్వారా మహిళా రిజర్వేషన్ అమలను తాము వ్యతిరేకిస్తున్నామని అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు
Amit shah


న్యూ ఢిల్లీ, 16 ఏప్రిల్ (హి.స.)మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులపై లోక్సభలో నేడు సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, హోం మంత్రి అమిత్ షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగింది. ఈ ప్రక్రియను జనగణనతో ప్రారంభించాలని అఖిలేశ్ యాదవ్ తొలుత సూచించారు. కులగణనను కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్పై కేంద్రం దూడుకులో అర్థం ఏమిటని ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఎందుకు అంత తొందర ప్రదర్శిస్తోంది. మొదటగా జనగణనతో ఈ ప్రక్రియను స్టార్ట్ చేయాలి’ అని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్కు తన పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. కానీ డీలిమిటేషన్ ద్వారా రిజర్వేషన్ అమలును వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

ఈ వాదనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఘాటుగా స్పందించారు. ‘దేశంలో ప్రస్తుతం జనగణన ప్రారంభమైంది. ఆ తరువాత కుల ఆధారిత సెన్సెస్ కూడా ఉంటుంది. ప్రస్తుతం గృహ గణన జరుగుతోంది. ఇళ్లు కులాల వారీగా ఉండవు. కుదిరితే ఇళ్లకు కూడా సమాజ్వాదీ పార్టీ కులాన్ని జోడిస్తుంది. కులగణనతో పాటు జనగణన జరుగుతుందని నేను సభకు హామీ ఇస్తున్నాను’ అని హోం మంత్రి అమిత్ షా అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande