రాష్ట్రంలో విద్యా శాఖ పథకాన్ని కొనసాగిస్తాం/ఐటీ మినిస్టర్.నారా.లోకేష్
అమరావతి, 27 జూలై (హి.స.) రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్ర
రాష్ట్రంలో విద్యా శాఖ పథకాన్ని కొనసాగిస్తాం/ఐటీ మినిస్టర్.నారా.లోకేష్


అమరావతి, 27 జూలై (హి.స.)

రాష్ట్రంలో విద్యాకానుక పథకాన్ని కొనసాగిస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. అమరావతి సచివాలయంలోని శాసన మండలిలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌ సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో విద్యా కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, టెండర్లు పిలవకుండానే విద్యా కానుక కిట్ల పేరిట కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారని అన్నారు. కిట్లు నాసిరకంగా ఉన్నాయని, వాటి కొనుగోళ్లపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యాకానుక కిట్ల పంపిణీని కొనసాగిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం గతేడాది విద్యాకానుక టెండర్లకు ఆర్థిక అనుమతులు లేకుండానే టెండర్లను ఫైనల్‌ చేసిందన్న విషయం శుక్రవారమే బయటకు వచ్చిందన్నారు. పిల్లలకు పుస్తకాలు ఎక్కువ బరువు ఉన్నాయని, ఈ అంశంపై ఏం చేయాలనేది ఆలోచన చేస్తున్నామని అన్నారు. విద్యార్థుల బ్యాగులు, పుస్తకాల బరువును తానే స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. బైజూస్‌ కంటెంట్‌ అంశంపై కూడా సమీక్షిస్తామన్నారు. ఈ పథకం కింద విద్యార్థులకిచ్చే బూట్ల సైజుల్లో తేడాలు ఉంటే అదే పాఠశాలలోగానీ, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో గానీ మార్చుకునే వెసులుబాటు కల్పిస్తామని, విద్యాకానుక కింద ఇచ్చే బ్యాగ్‌ల నాణ్యతపై కూడా ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.

హిందూస్తాన్ సమచార్

హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు


 rajesh pande