అమరావతి, 1 ఆగస్టు (హి.స.)
రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే సాధ్యమని తెదేపా ఎస్సీ సెల్ నాయకుడు ఆదెన్న అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టు తీర్పుతో మాదిగలు ఉప కులాల సుదీర్ఘ పోరాటం ఫలించిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రం తరుఫున ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కోర్టులో న్యాయవాదిని నియమించకుండా మాదిగల ద్రోహిగా నిలిచారని ఆరోపించారు. సమావేశంలో ఉసేని తదితరులు పాల్గొన్నారు.
హిందూస్తాన్ సమచార్
హిందూస్తాన్ సమచార్ / నిత్తల / నాగరాజ్ రావు