పాకిస్థాన్లో నిర్వహించనున్న ప్రతిష్టాత్మక ఛాంపియన్ ట్రోఫీ 2025 పై సందిగ్ధత..
స్పోర్ట్స్. 28 ఆగస్టు (హి.స.) ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్థాన్లో జరగనుందనే చర్చ జరుగుతోంది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది. అందుకే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో ఆడాలనే చర్చ మొదలైంది. ఆసియా కప్
ఛాంపియన్ ట్రోఫీ  2025


స్పోర్ట్స్. 28 ఆగస్టు (హి.స.)

ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ పాకిస్థాన్లో జరగనుందనే చర్చ జరుగుతోంది. అయితే భారత జట్టు పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే సందేహం నెలకొంది. అందుకే ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో ఆడాలనే చర్చ మొదలైంది. ఆసియా కప్ టోర్నీ కూడా ఇదే హైబ్రిడ్ మోడల్లో జరిగింది. అయితే ఈసారి ఏది ఏమైనా పాకిస్థాన్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ

నిర్వహించాలని పీసీబీ చెబుతోంది. ఈ మొండి వైఖరి విస్మయానికి గురి చేస్తోంది. కాగా తాజాగా బీసీసీఐ

కార్యదర్శి జై షా ఐసీసీ అధ్యక్షుడిగా

నియమితులయ్యారు. ఐసీసీ అధికార పీఠం ఇప్పుడు జై షా చేతుల్లోకి వెళ్లింది. ఇది పాకిస్థాన్కు పెద్ద సమస్యగా మారింది. డిసెంబరు 1, 2024 నుంచి జై షా అధ్యక్షుడిగా ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి

నుంచి ప్రారంభం కానుంది. కాబట్టి ఇది పాకిస్థాన్కు ఇబ్బందిగా మారడం ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గొనగా మొత్తం 15 మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ రౌండ్లో 12 మ్యాచ్లు జరగ నున్నాయి. కాబట్టి రెండు మ్యాచ్లు సెమీ ఫైనల్,ఒక ఫైనల్ మ్యాచ్ ఉంటాయి. భారత్, పాకిస్థాన్లు ఒకే

గ్రూపులో ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ Aలో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఉన్నాయి.

గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా,ఆఫ్ఘనిస్థాన్ ఉన్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్.. / నాగరాజ్ రావు


 rajesh pande