వినోదం, 10 సెప్టెంబర్ (హి.స.)
అందరూ ఎంత గానో వేచి చూస్తున్న ఎన్టీఆర్ దేవర మూవీ సెప్టెంబర్ 27న ఆడియెన్స్ ముందుకు రానుంది. కాగా ఈ రోజు సాయంత్రం 5 గంటలకు దేవర ట్రైలర్ విడుదల కానుంది. ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాబోతున్న మూవీ కావడంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా వేచి చూస్తున్నారు.
గత రెండు.. మూడు రోజుల నుంచి దేవర మూవీ విడుదలకు ముందే రికార్డులను బ్రేక్ చేస్తుంది. తాజాగా, అమెరికాలో సరి కొత్త రికార్డు క్రియోట్ చేసింది. ఇంకా ట్రైలర్ కూడా రాకుండానే 17 రోజుల ముందే ఆన్లైన్ బుకింగ్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. అంటే మన కరెన్సీ లో రూ.8 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీని గురించి చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
రిలీజ్ కి ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసిన ఫాస్టెస్ట్ మూవీ దేవరనే కావడం గమనార్హం. ఇంకా రిలీజ్ కి కొన్ని రోజులు సమయం ఉంది. ఇంకా ఎన్ని మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ ఒక్క రికార్డ్ తో ప్రభాస్ మూవీ రికార్డులన్ని వెనక్కి పోయాయి. పెద్ద సినిమాలు అయిన సలార్, కల్కి కూడా ప్రీ బుకింగ్స్ లో 1 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయలేకపోయాయి. ఇప్పటివరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, నేచురల్ స్టార్ నాని పేరిట అమెరికా మార్కెట్ లో రికార్డులు ఉన్నాయి మరి దేవరతో ఎన్టీఆర్ ఈ రికార్డులని బ్రేక్ చేస్తాడో? లేదో చూడాలి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..