గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా  ట్రైలర్ విడుదల..
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్లుగానే అంతకుమించిన విజువల్స్తో దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించారు. యాక్టింగ్లో రామ్ చరణ్ మరో మెట్టు ఎక్కా
గేమ్ చేజర్ ట్రైలర్


హైదరాబాద్, 2 జనవరి (హి.స.)

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన

పాత్రలో నటిస్తోన్న 'గేమ్ ఛేంజర్' సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది. అందరూ ఊహించినట్లుగానే అంతకుమించిన విజువల్స్తో దర్శకుడు శంకర్ తన మార్క్ చూపించారు. యాక్టింగ్లో రామ్ చరణ్ మరో మెట్టు ఎక్కాడనే చెప్పొచ్చు. రామ్ నందన్ పాత్రతో పాటు, అప్పన్న పాత్రకు కూడా జీవం పోశారు. ముఖ్యంగా 'మా పార్టీ సేవ చేయడానికే కానీ సంపాదించడానికి కాదు' అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ పిచ్చెక్కిందనడంలో సందేహం లేదు. ఇక కియారా, ఎజే సూర్య, శ్రీకాంత్ పాత్రలను ఎప్పుడెప్పుడు బిగ్ స్క్రీన్ మీద చూస్తామా? అనేలా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ మాత్రం అదిరిపోయిందని.. సినిమా కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande