హైదరాబాద్, 31 డిసెంబర్ (హి.స.) పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తోంది. 'పుష్ప 2' 25 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయలను క్రాస్ చేసిందని మైత్రి మూవీ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం ఈ సినిమా అతి త్వరలో ప్రపంచ వ్యాప్తంగా రూ.2000 కోట్లు సులువుగా రాబట్టవచ్చు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప 2' మొదటి వారంలో 725.8 కోట్లు, రెండవ వారంలో 264.8 కోట్లు, మూడవ వారంలో 129.5 కోట్లు రాబట్టింది. ఈ చిత్రం నాలుగో శుక్రవారం రూ.8.75 కోట్లు, నాలుగో శనివారం రూ.12.5 కోట్లు, నాలుగో ఆదివారం రూ.15.65 కోట్లు రాబట్టింది. నాలుగో వారాంతం ముగిసిన 26వ రోజు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దాదాపు రూ.6.65 కోట్ల బిజినెస్ చేసింది. అల్లు అర్జున్ సినిమా 26వ రోజు వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మొత్తం రూ.1163.65 కోట్లు రాబట్టింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్