తెలంగాణ, 29 డిసెంబర్ (హి.స.) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేoజర్ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో విజయ వాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశారు మెగా అభిమానులు. గేమ్ ఛేంజర్ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో ఈ కటౌట్ను ఏర్పాటు చేశారు.
విజయవాడ బృందావన కాలనీలో ఉన్న వజ్రా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు గేమ్ ఛేంజర్ చిత్ర యూనిట్ ఈ బిగ్గెస్ట్ కటౌట్ ను ఆవిష్కరించబోతుంది. వేడుకల్లో భాగంగా హెలికాప్టర్తో రామ్ చరణ్ కటౌట్కి పూలాభిషేకం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మాత దిల్ రాజుతో పాటు గేమ్ ఛేంజర్ చిత్ర బృందం హాజరు కాబోతుంది. అలాగే రామ్ చరణ్ అభిమానులు భారీగా రానున్నారు. కాగా సుమారు 256 అడుగుల ఎత్తుతో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ లుక్తో కటౌట్ ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద కటౌట్ అని మెగా అభిమానులు చెబుతున్నారు. ఈ కటౌట్ను ఏర్పాటు చేసేందుకు సుమారు ఐదురోజుల పాటు అభిమానులు కష్టపడ్డారు. కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణకు ప్రభుత్వం నుంచి పూర్తి అనుమతులు తీసుకున్నట్లు రామ్చరణ్ అభిమానులు ప్రకటించారు. కాగా తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ అవుతోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్