పవన్ కళ్యాణ్ సహాయం పై నటుడు ఫిష్ వెంకట్ ఎమోషనల్
హైదరాబాద్, 2 జనవరి (హి.స.) టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంక‌ట్ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌గా నిలిచారు. అనారోగ్యం కార‌ణంగా సినిమాల‌కు దూరం
ఫిష్ వెంకట్


హైదరాబాద్, 2 జనవరి (హి.స.)

టాలీవుడ్ న‌టుడు ఫిష్ వెంక‌ట్ గ‌త కొంత‌కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆయ‌నకు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ అండ‌గా నిలిచారు.

అనారోగ్యం కార‌ణంగా సినిమాల‌కు దూరం కావ‌డంతో వెంక‌ట్‌ ఆర్థికంగాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్ర‌మంలో చాలా మంది ప్ర‌ముఖ న‌టులు తెలుసు క‌నుక ఈ క‌ష్ట‌స‌మ‌యంలో ఎవ‌రినైనా సాయం కోరాల‌ని కుటుంబ స‌భ్యులు సూచించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు.

దాంతో సాయం విష‌య‌మై త‌న భార్య సువ‌ర్ణ ఒత్తిడి మేర‌కు ప‌వ‌న్‌ను క‌లిసిన‌ట్లు వెంక‌ట్ చెప్పారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్‌ను క‌లిసి, త‌న అనారోగ్య స‌మ‌స్య‌ను వివ‌రించ‌డంతో వెంట‌నే అన్ని విధాలా స‌హాయం చేస్తాన‌ని హామీ ఇచ్చార‌ని ఆయ‌న తెలిపారు. అలాగే త‌న ఆర్థిక ఇబ్బందులను గ‌మ‌నించి త‌న బ్యాంకు ఖాతాలో వెంట‌నే రూ. 2 ల‌క్ష‌లు జ‌మ చేయించార‌ని వెంక‌ట్ పేర్కొన్నారు.

త‌న‌ను ఈ క‌ష్ట‌కాలంలో ఆదుకున్న ప‌వ‌న్ క‌ల్యాణ్, ఆయ‌న కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాల‌ని దేవుడ్ని కోరుకుంటున్నాన‌ని ఫిష్ వెంక‌ట్ భావోద్వేగానికి గుర‌య్యారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande