డాకు మ‌హారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్  నేప‌థ్యంలో హైదరాబాదులో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు
తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.) నటసింహ బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫ‌స్ట్ బెటాలియ‌న్ గ్రౌండ్స్‌లో నేడు జరగనున్న నేప‌థ్యంలో యూసుఫ్‌గూడ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. జూబ్లీహిల్స్ చెక్
ట్రాఫిక్ ఆంక్షలు


తెలంగాణ/ఏ.పీ, 10 జనవరి (హి.స.)

నటసింహ బాల‌కృష్ణ న‌టించిన డాకు మ‌హారాజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసుఫ్‌గూడ ఫ‌స్ట్ బెటాలియ‌న్ గ్రౌండ్స్‌లో నేడు జరగనున్న నేప‌థ్యంలో యూసుఫ్‌గూడ ప‌రిస‌ర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు.

జూబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి కోట్ల విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి స్టేడియం వైపు వ‌చ్చే వాహ‌నాల‌ను కృష్ణాన‌గ‌ర్ వ‌ద్ద మ‌ళ్లించ‌నున్నారు. ఈ వాహ‌నాల‌ను శ్రీన‌గ‌ర్ కాల‌నీ, పంజాగుట్ట మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

మైత్రివ‌నం జంక్ష‌న్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను ఆర్బీఐ క్వార్ట‌ర్స్, కృష్ణా న‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద మ‌ళ్లించనున్నారు

మైత్రివ‌నం జంక్ష‌న్ నుంచి బోర‌బండ బ‌స్టాప్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను కృష్ణ‌కాంత్ పార్క్, జీటీఎస్ టెంపుల్, క‌ల్యాణ్ న‌గ‌ర్, మోతీ న‌గ‌ర్ మీదుగా బోర‌బండ బస్టాప్ వైపు అనుమ‌తించ‌నున్నారు.అదే విధంగా బోరబండ నుంచి మైత్రివ‌నం జంక్ష‌న్ వైపు వెళ్లే వాహ‌నాల‌ను జీటీఎస్ కాల‌నీ, క‌ల్యాణ్ న‌గ‌ర్ జంక్ష‌న్, ఉమేశ్ చంద్ర విగ్ర‌హం మీదుగా మ‌ళ్లించ‌నున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande