తెలంగాణ/ఏ.పీ, 9 జనవరి (హి.స.)
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన డాకూ మహరాజ్ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్ ను ఇవాళ అనంతపురంలో నిర్వహించాలనుకున్నారు. ఈ ఈవెంట్ కు ఏపి మంత్రి, బాలయ్య అల్లుడు నారా లోకేష్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అయితే తిరుమల ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో కొందరు భక్తులు మరణించడంతో ఈ ఈవెంట్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
మరణించిన వారి బంధువులంతా విషాదంతో ఉన్న తరుణంలో ఆనందంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం భావ్యం కాదు అనే రద్దు చేస్తున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. అయితే తమ బ్యానర్ లో బాలయ్య ఫస్ట్ టైమ్ సినిమా చేశాడు అనే ఆనందంతో ఈ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు చేసింది సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్. బట్ జరిగిన విషాద ఘటనను దృష్టిలో ఉంచుకుని రద్దు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్