డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ కి ఫోన్ చేసి వరద పరిస్తితి పై చర్చించారు
అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.) అమరావతి, సెప్టెంబర్ 11: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ () ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కలెక్టర్ కి ఫోన్ చేసి వరద పరిస్తితి పై చర్చించారు


అమరావతి, 11 సెప్టెంబర్ (హి.స.)

అమరావతి, సెప్టెంబర్ 11: ఏలేరు వరద ఉధృతిపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ () ఆరా తీశారు. బుధవారం ఉదయం కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఫోన్ చేసి వరద పరిస్థితిపై చర్చించారు. ఎగువున కురిసిన భారీ వర్షాల మూలంగా ఏలేరు, తాండవ రిజర్వాయర్లకు ఇన్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 62 వేల ఎకరాలు ముంపునకు గురయ్యాయని కలెక్టర్ తెలిపారు.

గండ్లు పడటం, రహదారులపైకి నీటి ప్రవాహం చేరటం వల్ల పిఠాపురం, పెద్దాపురం నియోజకవర్గాల్లో పిఠాపురం - రాపర్తి, పెద్దాపురం - గుడివాడ, సామర్లకోట - పిఠాపురం మార్గాల్లో రాకపోకలు స్తంభించాయన్నారు. గొల్లప్రోలు దగ్గర జాతీయ రహదారిపై ప్రవాహం ఎక్కువగా ఉన్నందున వాహనాలను దారి మళ్లించినట్లు వెల్లడించారు. వరద బారిన పడ్డ ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన పడవలు, సహాయక బృందాలు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. ఏలేరుకి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోందన్నారు. ఈరోజు ఉదయం 8 గంటలకు 12,567 క్యూసెక్కుల ఇన్ఫ్ ఫ్లో కి వచ్చేసిందని తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 24.11 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22.16 టీఎంసీలు ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande