ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కనుమ పండుగ శుభాకాంక్షలు..
తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.) కనుమ పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్
సీఎం చంద్రబాబు విషెస్


తెలంగాణ/ఏ.పీ, 15 జనవరి (హి.స.)

కనుమ పండుగను పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, శుభాకాంక్షలు తెలిపారు. “రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మారినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కమారు కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రజలందరికి కనుమ పండగ శుభాకాంక్షలు. కమ్మని విందుల కనుమ పండుగ మీ కుటుంబంలో సంతోషం నింపాలి. వ్యవసాయదారుల జీవితాలతో విడదీయరాని అనుబంధం పెనవేసుకొన్న పశు సంపదను పూజించే పవిత్ర కర్తవ్యాన్ని కనుమ పండుగ మనకు బోధిస్తుంది. కాలం మరినా తరగని అనుబంధాల సంపద మనది. ఆ విలువలను కాపాడుకుంటూ… ముందుకు సాగాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande