లోకేషన్ ట్రేస్ ఆరోపణలపై నిజామాబాద్ జిల్లాలో సీఐపై వేటు.
తెలంగాణ, నిజామాబాద్. 15 జనవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా లోని భీంగల్ సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. ఇటీవల భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన‌ పలు కేసుల్లో సీ
నిజామాబాద్ జిల్లా సిఐ


తెలంగాణ, నిజామాబాద్. 15 జనవరి (హి.స.) నిజామాబాద్ జిల్లా లోని

భీంగల్ సర్కిల్ ఇన్ స్పెక్ట‌ర్ నవీన్ పై అధికారులు బదిలీవేటు వేశారు. నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెళ్లడయ్యాయి. ఇటీవల భీంగల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన‌ పలు కేసుల్లో సీఐ నవీన్ పై ఆరోపణలు వచ్చాయి. భీంగల్ కు చెందిన సత్య గంగయ్య తన కేసు విషయంలో తన లొకేషన్ ను సీఐ ట్రేస్ చేసి ఇవ్వడంతోనే తనపై దాడి చేయడం జరిగిందని ఆరోపణలు చేశారు.

తనపై దాడికి పూర్తి బాధ్యత సీఐ దేనని ఆర్మూర్ ఏసీపీ విచారణలో బాధితుడు చెప్పినట్టు సమాచారం. ఈ వివాదం నేపథ్యంలో సీఐని నిజామాబాద్ హెడ్ క్వార్టర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెల్లడైన‌ట్టు సమాచారం. సీఐపై వచ్చిన ఆరోపణలపై పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు, జర్నలిస్ట్


 rajesh pande