హైదరాబాదులో మరోసారి రేవ్ పార్టీ కలకలం.. 18 మంది అబ్బాయిలు, ఎనిమిది మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్న గచ్చిబౌలి పోలీసులు
హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.) హైదరాబాద్లో మత్తు కల్చర్ నానాటికి పెరిగిపోతోంది. యువతీ, యువకులు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. రేవ్ పార్టీల పేరుతో గుప్పుగుప్పుమని లాగించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో గంజాయి కల
హైదరాబాదులో మరోసారి రేవ్ పార్టీ కలకలం


హైదరాబాద్, 11 సెప్టెంబర్ (హి.స.)

హైదరాబాద్లో మత్తు కల్చర్ నానాటికి

పెరిగిపోతోంది. యువతీ, యువకులు గంజాయి, డ్రగ్స్కు అలవాటు పడిపోతున్నారు. రేవ్ పార్టీల పేరుతో గుప్పుగుప్పుమని లాగించేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో నిర్వహించిన ఓ రేవ్ పార్టీలో గంజాయి కలకలం రేపింది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు గచ్చిబౌలిలోని ఓ గెస్ట్ హౌస్పై దాడి చేశారు. పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవిస్తున్న 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది. ఇంతకుముందు ఎన్నిసార్లు పార్టీలు నిర్వహించారు. పార్టీ వెనుక ఉంది ఎవరు? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. పోలీసులు ఎన్నిమార్లు హెచ్చరించినా నగరంలో రేవ్ పార్టీలు ఆగడం లేదు.పుట్టినరోజు వేడుకలు, గెట్ టు గెదర్ లు అంటూ

యువత రేవ్ పార్టీలు నిర్వహిస్తుంది. ఇందులో ఎక్కువగా బడా బాబుల పిల్లలే ఉంటున్నారు. తాజాగా

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని భగ్నం చేశారు. మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు. గచ్చిబౌలి

పోలీసు స్టేషన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ఓ సర్వీస్ అపార్ట్మెంట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారన్న

సమాచారంతో దాడి చేసిన ఎస్ ఓటీ, గచ్చిబౌలి పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ రేవ్ పార్టీలో పలువురు వ్యాపారులు, ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తం 18 మంది పాల్గొనగా పార్టీలో 12

మంది అబ్బాయిలు, 6 మంది అమ్మాయిలను అదుపులోకి తీసుకున్నారు. పక్కా విశ్వసనీయ

సమాచారంతో మెరుపు దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు వారి వద్ద నుండి 45 గ్రాముల గంజాయి, సిగరెట్లు, విదేశీ

మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 18 మందికి

41 సీఆర్ పీసీ నోటీసులు ఇస్తామని గచ్చిబౌలి పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీలో పలువురు

ప్రముఖుల పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు

సంబంధించి కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande